ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి వినవి పత్రం అందజేత
గద్దర్ ఐక్యవేదిక కమిటీ: తాళ్ల పెళ్లి విజయ్
హన్మకొండ, నేటిధాత్రి:
ఈరోజు గద్దర్ ఆలోచన ఐక్య వేదిక కమిటీ తాళ్ళపెల్లి విజయ్ ఆధ్వర్యంలో ఎంమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకముగా కలవడం జరిగింది.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహం, గద్దర్ కళా క్షేత్రం మరియు పాఠ్య పుస్తకాలలో గద్దర్ జీవిత చరిత్ర ఏర్పాటు చెయ్యాలని కోరడం జరిగింది ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించి మంత్రులు, కలెక్టర్, కమిషనర్ గార్ల దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు అనంతరం గద్దర్ ఆలోచన ఐక్య వేదిక కోకన్వీనర్ సుద్దాల నాగరాజు మాట్లాడుతూ గద్దర్ బ్రతికినంత కాలం ప్రజలకు సేవ చేస్తూ బ్రతికిన్నారు అని అన్నారు తెలంగాణ ఉద్యమ గొంతుక.. గద్దర్ అని అన్నారు. ఆనాడు తెలంగాణ మాలిదశ ఉద్యమంలో తన ఆట పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు
ప్రభుత్వం తక్షణమే చేరువ తీసుకొని హన్మకొండ హయగ్రీవచారి గ్రౌండ్ లో ప్రభుత్వ భూమి అయిన అవసరమైన స్థలాన్ని కేటాయించి గద్దర్ కళా క్షేత్రాని ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ ఐక్యవేదిక కమిటీ సభ్యులు అజ్మీరా వెంకట్ సోషల్ మీడియా కన్వీనర్ గజ చందు రామసుందర్ నగర్ భక్కి శివ దాసరి రమేష్ మోలుగురి యాకయ్య రానా సాగర్ ఐతే అనీల్ తదితరులు పాల్గొన్నారు.