
Palamaneru Auto Drivers Rally Celebrates Welfare Scheme
*పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..
*మార్కెట్ యార్డ్ నుంచి మదర్ థెరిసా కళాశాల వరకు భారీగా జరిగిన ఆటో ర్యాలీ..
*ఆటో డ్రైవర్ల ఆనందం…కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 04:
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ఆర్థిక చేయుతను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పలమనేరులో దిగ్విజయంగా సాగింది.
ఆ మేరకు కూటమి నాయకులతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారుపట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం చిత్తూరు డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారుమార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం గంగవరం మండలంలోని మదర్ తెరిసా కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూడ్రైవర్ల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు.ఆటో డ్రైవర్ సేవలో, పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.చెప్పినవి. చెప్పనవి.
చేసి చూపే ఏకైక నాయకుడు చంద్రబాబని.. ఆయనకున్న దూర దృష్టి కారణంగా నేడు రాష్ట్రం అన్ని రంగాలలో పరుగులు పెడుతోందని కొనియాడారు. మనందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మునుముందు కూటమి ప్రభుత్వానికి అందరి మద్దతు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, డిఆర్డిఏ పీడీ శ్రీదేవి, ఎం వి ఐ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాజన్న, నాయకులు ఆర్.వి. బాలాజీ, రంగనాథ్, కిషోర్ గౌడ్, సోమశేఖర్ గౌడ్,ఆనంద, నాగరాజు రెడ్డి,
ఆర్ బి సి, కుట్టి,సుబ్రహ్మణ్యం గౌడ్,
నాగరాజు, రాంబాబు,, మదన్, శ్రీధర్, బిఆర్సీ కుమార్, జనసేన నాయకులు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్, నాగరాజు మరియు సింగిల్ విండో చైర్మన్ లు మరియు డైరెక్టర్లులతో పాటు ఆటో యూనియన్ లీడర్లు మురుగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.