బొమ్మకంటి చంద్రమౌళి ఎస్సీ సెల్ అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మన తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా గత వారం రోజుల కిందట నూతనంగా ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటాలను ఇంతవరకు కొన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయలేదని అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేసేలా సంబంధిత రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు చర్యలు చేపట్టాలని,పరకాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి విజ్ఞప్తి చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయి రోజులు గడుస్తున్న ప్రభుత్వ కార్యాలయల్లో అధికారులు ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు ఎక్కడ ఏర్పాటు చేయలేదని,సంబంధిత అధికారులు స్పందించి ఇప్పటికైనా ఆయా ప్రభుత్వాల కార్యాలయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను ఏర్పాటు చేయాలని చంద్రమౌళి కోరారు.