
వర్కింగ్ జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ
సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతిపత్రం అందజేశారు.
బెల్లంపల్లి నేటిధాత్రి
బెల్లంపల్లి పట్టణంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ బెల్లంపల్లి టేకులబస్తీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతిపత్రం అందజేశారు. ముందుగా సబ్ కలెక్టర్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ సందర్బంగా జర్నలిస్ట్ లు మాట్లాడుతూ పట్టణంలో చాలామంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే, కోశాధికారి కత్తుల నవీన్, కార్యవర్గ సభ్యులు ఎం భాస్కర్,కే రమేష్ తదితరులు పాల్గొన్నారు