
జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ కుస రవీందర్
బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలము, వరదవెల్లి గ్రామములో స్వయంబుగా వెలసిన దత్తాత్రేయ స్వామి దేవాలయ అభివృద్ధి మరియు రవాణా సౌకర్యము గురించి.భారతదేశంలోని రాహుశయన దత్తాత్రేయ స్వామి 500 సరాల క్రితం శ్రీ వెంకట అవదూత ఘోర తపస్సు చేయగా స్వయంబు దత్తాత్రేయ స్వామి గా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలము, వరదవెల్లి గ్రామములో స్వయంబుగా వెలసినారు. ఎన్నో సంవత్సరాల నుండి పూజ కార్యక్రమములు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా ప్రక్కన మహారాష్ట్ర, కర్ణాటక నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు వస్తుంటారు. పూజలు చేసేవారు. కాని ఇట్టి దత్తాత్రేయ స్వామి దేవాలయము మిడ్ మానేరు డ్యామ్ లో మునిగిపోయినది. అప్పటి నుండి పూజ కార్యక్రమములు రోజు నిర్వహించడం లేదు. కేవలం దత్తాత్రేయ జయంతి రోజు మాత్రమే పడవలలో వెళ్ళి పూజలు చేస్తున్నారు.
కావున ఇట్టి దత్తాత్రేయ స్వామి దేవాలయము చుట్టూ నీరు ఉండి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. దాదాపు పైన 20 ఎకరముల భూమి ఉంటుంది. దేవాలయము టూరిజం శాఖ ద్వారా దేవాలయము అభివృద్ధి మరియు బ్రిడ్జి నిర్మాణము చేయగలరని ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కొండం సతీష్ రెడ్డి,కొనుకటి సూర్యకాంత్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.