తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గ్యారెంటీల అమలు,ప్రధానంగా మద్యం షాపులను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేయాలని కోరారు.
గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని మద్యం మత్తులో యువత మద్యానికి బానిసలు అవ్వడంతో మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని
మద్యం షాపుల యజమానులు బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని
మద్యం బెల్ట్ షాపులలో క్వార్టర్లు40 రూపాయలు బీరుకు 40 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం లభిస్తుండడం అధిక ధరలకు విక్రయించడంతో పేద కుటుంబాలు చిన్నభిన్నమవు తున్నాయని ఎంతోమంది అనారోగ్యబారిన పడి మరణిస్తున్నారుకూలీ నాలీ చేసుకునేవారు రోజంతా కష్టపడి సంపాదించిందంతా మధ్యానికే ఖర్చు చేస్తున్నారని ఒక్కో గ్రామంలో 10 నుండి 15 వరకు బెల్టుషాపులు నిర్వహిస్తు న్నారని ఆవేదన చెందారు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో బెల్ట్ షాపులను మూసివేయుటకు ఆప్కారి మరియు పోలీసులతో చర్చించి తక్షణమే బెల్టు షాపులను మూసివేయుటకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వంగర సాంబయ్య ,ఆడేపు అశోక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.