-రిమాండ్ కి తరలింపు
-వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి
కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో జనశక్తి నక్సలైట్ పేరుతో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ పార్టీ ఫండ్ పేరిట డబ్బులు వసూళ్ళకి పాల్పడుతున్న చెన్నమనేని పురుషోత్తం రావు అనే వ్యక్తిని కోనరావుపేట పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు వేములవాడ డిఎస్పీ నాగేంద్ర చారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ బోయినపల్లి మాండలం కొదురుపాక గ్రామానికి చెందిన చెన్నమనేని పురుషోత్తం రావు అనే వ్యక్తి ప్రభుత్వ నిషేధిత విప్లవ సంస్థ అయిన జనశక్తి అరుణోదయ సంస్థలలో పని చేస్తున్న అని అమాయక ప్రజలను బెదిరింపులకు పాల్పడుతూ పార్టీ ఫండ్ పేరిట ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాలపడుతున్న చెన్నమనేని పురుషోత్తం రావు ని కోనరావుపేట పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు డిఎస్పీ తెలిపారు.
జనశక్తి నక్సలైట్ల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు వసూలుకు పాల్పడే వారి సమాచారం,జనశక్తి పెరు మీద ఎవరైనా ఫోన్ కాల్ చేసి బెదిరించే వారి సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమాచారం అందివ్వలని వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.