లక్షెట్టిపేట (మంచిర్యాల)నేటిధాత్రి:
లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామంలో బుదవారం సాయంత్రం గాగిరెడ్డి లక్ష్మరెడ్డి అనే 64సంవత్సరాల వ్యక్తి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతునికి బార్య ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతరు పెండ్లి చేసుకుని కెనడాలో ఉండగా కొడుకు హైదరాబాదులో ప్రైవేట్ జాబ్ జేసుకుంటు జీవిస్తున్నాడు. దౌడేపల్లిలో బార్య భర్తలు ఇద్దరే ఉండేవారు. పిల్లలు దూరంగా ఉండటం వృద్యాప్యం దగ్గర పడుతుండటంతో చాలా దిగులు చెందేవాడు. కొడుకు సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చి బుధవారం మద్యాహ్నం హైదరాబాద్ వెల్తుండగా మృతుడు దగ్గర ఉండి గ్రామంలో ఆటో ఎక్కించి ఇంటికి వచ్చిచ్చాడు. ఆటోలో కొడుకును పంపించే సమయంలో కూడా దిగులు పడుతు ఉండటం చూసి కొడుకు దిగులు పడకు అని చెప్పిన కూడా మనస్థాపంతో ఇంటికి వచ్చి గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకుని చనిపోయాడు.
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
