చందుర్తి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందుర్తి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపల్లి గ్రామానికి చెందిన బైరి బాబు(45) అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడట్లుగా తెలిపారు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు..
ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
