డాక్టర్ వెంకన్న పరిశోధనకు దక్కిన పేటెంట్
అభినందించిన సికెఎం కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ రావు
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ లోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జంతుశాస్త్ర విభాగంలో, అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ లునావత్ వెంకన్న ఔషధ మొక్కల నుండి తయారుచేసిన రసాయనాల బయలాజికల్ యాక్టివిటీస్ పై, చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వo ఇటీవల పేటెంట్ మంజూరు చేసింది. ఈ మేరకు సికేఎం కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిధర్ రావు డాక్టర్ వెంకన్నను అభినందించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పరిశోధనలకు పేటెంట్ లభించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఇలాంటి అంశాలను అధ్యాపక బృందం స్పూర్తిగా తీసుకొని సికెఎం కళాశాలలో పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పేటెంట్ సాధించిన వెంకన్న కేయూ జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి పర్యవేక్షణలో పిహెచ్ డి, పిడిఎఫ్ పూర్తి చేశారని తెలిపారు. అదేవిధంగా తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఎం.మాధవి అత్యంత ప్రతిష్టాత్మకమైన యుజిసి నెట్ డిసెంబర్ 2024న జరిగిన పరీక్షలో క్వాలిఫై అయినందుకు సికెఎం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్, అధ్యాపకులు,, బోధనేతర సిబ్బంది మాధవిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ .ధర్మారెడ్డి, డాక్టర్ వరప్రసాద్, గ్రంథపాలకులు ఎస్ అనిల్ కుమార్, కెప్టెన్ డాక్టర్ పి సతీష్ కుమార్, సూపరిండెంట్ జి శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, పాషా , అతిధి అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.