జిల్లా సంక్షేమ అధికారి నాగేశ్వరరావు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నైన్ పాక గ్రామంలోని హైస్కూల్లో శుక్రవారం రోజున పోషణ పక్వాడ ప్రోగ్రామును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి నాగేశ్వరరావు సిడిపిఓ అవంతి హాజరై పోషణ్ పక్వాడ గురించి మరియు కిషోర బాలికలలో గర్భవతులు బాలింతలు పిల్లలలో పోషకాహార లోపాన్ని రక్తహీనతను లోబర్త్ వేటును తగ్గించుటకు తీసుకోవలసిన సమతుల హారము, వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత త్రాగునీరు పెరటి తోటల పెంపకం ఆరోగ్య పరీక్షలు ప్రతినెల పిల్లలు తల్లులు బరువులు తీయించుకోవడం వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవడం ప్రభుత్వ ఆస్పటల్ లో డెలివరీ చేయించుకోవడం డెలివరీ అయిన వెంటనే మొట్టమొదట వచ్చే ముర్రుపాలను పిల్లలకు పట్టించడం కేవలంఆరు నెలల వరకు తల్లిపాలు తాగించడం ఆరు నెలలు దాటిన తర్వాత బాలమృతం తినిపించడంతోపాటు తల్లిపాలు కొనసాగించాలని వివరించారు, అలాగే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ముగ్గురు గర్భవతులకు శ్రీమంతాలు నలుగురు పిల్లలకు అక్షరాభ్యాసము చేయించి అందరితో ప్రతిజ్ఞ చేయించనైనది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సుభద్ర సుజాత హైమావతికరుణమెహర్ ఉనిసా చైల్డ్ లైన్ శైలజ స్కూల్ హెచ్ఎం ఊర్మిళ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులుఎం ఎస్ కె అనూష ఆశ వర్కర్స్ సాయి వేద, సుమలత, శోభ ,తల్లులు ఆయాలు మహిళలు హాజరైనారు.