అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్ రెడ్డి.
అసెంబ్లీ సాక్షిగా “అమ్మ,నాన్న”ల కోసం కోత్త చట్టం.
`అమ్మా నాన్నల ముందు దేవుళ్ళు కూడా దిగదుడుపు.
`దేవుళ్ళ కన్నా ముందు అమ్మానాన్నలను కొలువు.
`అమ్మానాన్నలే ముల్లోకాలని చెప్పిన వినాయకుడి చరిత్ర చదువు.
`అమ్మానాన్నలను ఎంత కొలిచినా తక్కువే!
`నవమాసాలు మోసి కనేది తల్లి.
`ప్రసవం ఒక నరకమని తెలిసినా జన్మనిచ్చేది తల్లి.
`తల్లి కావడమే జీవిత పరమార్థంగా బిడ్డను కనేది తల్లి.
`తన రక్తాన్నే పాలుగా మార్చి ప్రాణం నిలిపేది తల్లి.
`బిడ్డను గుండెల మీద పెట్టుకొని పెంచేది నాన్న.
`బిడ్డల కోసం సర్వం త్యాగం చేసేది నాన్న.
`కాలంతో పరుగెత్తి పిల్లలని నిలబెట్టేది నాన్న.
`పిల్లలు ఎదుగుతుంటే ఆకాశమంత సంతోషం నింపుకునేది నాన్న.
అమ్మానాన్నలు వయసు మల్లగానే బరవై పోతున్నారు!
`అమ్మానాన్నలకు బుక్కెడు బువ్వ పెట్టడానికి కొడుకులకు చేతులు రావడం లేదు.
`బతికినన్నాళ్ళు పిల్లల కోసమే తల్లిదండ్రులు తపిస్తారు.
`ఆకలి చంపుకొని ఆస్తులు కూడబెడతారు.
`తాము పడిన కష్టం పిల్లలు పడొద్దని రూపాయి రూపాయి కూడబెడతారు.
`ఎవరి స్తొమత ను బట్టి వాళ్ళు ఆస్తులు అందిస్తారు
`ఆస్తులు తీసుకొని అమ్మానాన్నలను వెళ్లగొడుతున్నారు.
`తల్లిదండ్రులను పంచుకుంటున్నారు.
`పిడికెడు ముద్ద పెట్టడానికి కూడా ఇష్టపడటం లేదు.
`గోరు ముద్దలు చేసి పెట్టి కడుపు నింపిన తల్లికి పిడికెడు మెతుకులు పెట్టని దొంగనా కొడుకులున్నారు.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఇకపై ఏ కొడుకైనా సరే తన తల్లిదండ్రుల విషయంలో కటువుగా వ్యవహరించినా, ముదిమి వయసులో వారిని ఆదరించకపోయినా ఆ కసాయి బిడ్డలకు ఇక కటకటాలే. శ్రీకష్ణుడి జన్మస్దానాలే దిక్కు. ఇది తెలంగాణ ప్రభుత్వం తల్లిదండ్రులకు ఇచ్చిన గొప్ప వరం. ప్రతి కొడుకు తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిందే. వారి ఆలనా పాలనా చూడాల్సిందే. కన్న తల్లిదండ్రులను తమ పిల్లలతో సమానంగా చూసుకోవాల్సిందే. వారి గౌవరానికి భంగం కలిగినా క్షమించరాని నేరమౌతుంది. దేశంలో ఎక్కడ చూసినా ముసలి తల్లిదండ్రుల ఆక్రందనలే. ఆకలి కేకలే. ఆవేధనలే. కన్నీటితో తడుస్తున్న జీవితాలే..ఏడ్చి ఏడ్చి ఎండిపోతున్న కనీళ్లే. గూడు లేక, దారి లేక, దిక్కులేక, చూసే కొడుకులున్నా ఆదరణ లేక అనాధలౌతున్న తల్లిదండ్రుల మీద భక్తి లేని కొడుకులకు శిక్షలు పడితే గాని దారికి రారు. నయానో, భయానో చెబితే ఎవరికీ చెవికెక్కడం లేదు. ప్రభుత్వాలు సూచిస్తున్నా కంటికి కనిపించలేదు. అందుకే కటకటాలు చూపిస్తే గాని అలాంటి దొంగనా కొడుకులకు బుద్ది వస్తుంది. తల్లిదండ్రుల మీద భక్తి వుండాలి. ఆ భక్తి లేనప్ప్పుడు భయం పుట్టాలి. ఈ రోజుల్లో బాద్యత లేని పిల్లలకు తల్లిదండ్రులంటే భయం కలగాలి. తల్లిదండ్రులను చూసుకోకపోతే చట్టం శిక్షిస్తుందన్న భయం పుట్టాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సిఎం. రేవంత్రెడ్డి మదిలో నుంచి పురుడుపోసుకున్న చట్టం అసెంబ్లీలో చేయబడింది. ఇక మీదట తల్లిదండ్రుల మీద దయలేని కొడుకులెవరైనా సరే అది ఎంతటి ఉన్నతస్ధానాల్లో వున్నవారైనా, అది సామాన్యులైనా, అసామాన్యులైనా సరే తల్లిదండ్రులను సాకుకోవాల్సిందే. దగ్గరుండి వారి uరువు బాధ్యతలు మోయాల్సిందే. వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిందే. జీవిత చరమాంకం వరకు పుట్టిన నుంచి పెరిగి పెద్దయ్యేదాకా తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో అలా పిల్లలు కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ముదిమి వయసులో వారు కంట తడిపెట్టుకోకుండా చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఏ కొడుకైనా వ్యవహరిస్తే వారి నుంచి నెలకు రూ.10 తల్లిదండ్రులకు చెల్లించేలా అసెంబ్లీలో చట్టం చేశారు. తల్లిదండ్రులకు పెద్దకొడుకుగా సిఎం. రేవంత్ రెడ్డి ఒక దారి చూపించారు. తెలంగాణలో కొన్ని వందల వద్దాశ్రమాలున్నాయి. పెళ్లి చేసుకోగానే తల్లిదండ్రులు భారమైపోతున్న కొడుకులు చాలా మంది వున్నారు. ఒకరిని చూసి ఒకరు తయారౌతున్నారు. తమ తల్లిదండ్రులను వద్దాశ్రమంలో చేర్పించామని చెప్పడం కూడా గర్వకారణంగా చెప్ప్పుకునే దౌర్భాగ్యులు తయారయ్యారు. ఈ పక్క ఇంట్లో వాళ్లు వాళ్ల తల్లిదండ్రులను వద్దాశ్రమంలో చేర్పించారని తెలియగానే అది తప్పని చెప్పాల్సిన ఆ పక్క ఇంటి వాళ్లు అదే పని చేస్తున్నారు. ఎవరూ దిక్కులేని వాళ్ల కోసం అనాదాశ్రమాలు వుండడం సమాజానికి మేలు. కాని కన్న కొడుకులు బతికుండి, బాగానే బతుకుతున్న వారు కూడా వారి తల్లిదండ్రులను వద్దాశ్రమాలలో చేర్పించడం పాపం. ఇకపై అది నేరం కూడా అని భయం పుట్టాలి. ఇందులో కూడా రకరకాల కొడుకులు వున్నారు. కొందరమేమో ఎంత ఖర్చైనా సరే అని వద్దాశ్రమాలలో చేర్పిస్తున్నారు. కొంత మంది తల్లిదండ్రులను పోషించడం తమ వల్ల కాదని తప్పించుకునేందకు అనాదాశ్రమాలలోచేర్పిస్తున్నారు. ఇంకా కొంత మంది దుర్మార్గులు తల్లిదండ్రులను కొడుతూ, తిడుతూ, నిత్య నరకం చూపిస్తూ, అనాదాశ్రమాలకు వెళ్లేలా చేస్తున్నారు. ఇంకా కొంత మంది రాక్షస మనస్తత్వం వున్న వెదవలు తల్లిదండ్రులను ఇంట్లోనుంచి వెళ్లగొడుతున్నారు. తమకు ఏం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాళ్లందరికీ గుణపాఠం కన్నా భయం కావాలి. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ప్రభుత్వం కేసు నమోదు చేస్తుందన్న భయం పుట్టాలి. కన్న తల్లిదండ్రులను చూసుకోలేకపోతే నెల నెల పది వేల రూపాయాలు ఇవ్వాల్సి వస్తే డబ్బు ఇవ్వడం కన్నా, చూసుకోవడమే మేలనుకునే వారు కూడా మధ్య తరగతిలో వుంటారు. కనీసం భయంతోనైనా తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకుంటారు. తల్లిదండ్రులు కట్టించిన ఇళ్లలో వుంటూ, వారు ఇచ్చిన ఆస్దులను అనుభవిస్తూ, తల్లిదండ్రులకు పిడికెడు మెతుకులు పెట్టుకుండా కడుపు మార్చుడుతున్న కసాయి కొడుకులు చాలా మంది వున్నారు. అందుకే దేశంలో ఇన్ని వద్దాశ్రమాలు వెలుస్తున్నాయి. ఇలాగే ప్రభుత్వం వదిలేస్తే నగరాల్లో గల్లీకొక వద్దాశ్రమం, జిల్లాల్లో మండలానికో వద్దాశ్రమాలు వెలుస్తాయి. లేకుంటే తల్లిదండ్రులు అనాధలైపోతారు. ఆకలికి కేకలతో కడపు కాలి చనిపోతారు. మంచినీటికి దిక్కులేకుండాపోతారు. అందుకే సిఎం. రేవంత్రెడ్డి ఈ చట్టం ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆయన చెప్పిన విషయాలు తెలంగాణ సమాజాన్ని కదిలించాయనిచెప్పడంలో సందేహం లేదు. పెద్దపెద్ద వాళ్లుగా చెలామణి అవుతున్న వారు కూడా తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు. తల్లిదండ్రుల పాలిట కసాయిలుగా మారుతున్నారు. కన్న పిల్లలే తల్లిదండ్రులకు బతికుండగానే నరకం చూపిస్తున్నారు. ఇంకా కొంత మంది తల్లిదండ్రులను సహించక వారి ఉసురు కూడా తీస్తున్నారు. తిట్టి, కొట్టి,తన్ని, గొంతు పిసికి కూడా చంపేస్తున్నారు. సాధారణ మరణంగా చిత్రీకరిస్తున్నారు. కన్నతల్లిని కూడా కొడుతూ, తిడుతూ, తంతున్న కొడుకులు మన సమజాంలో అనేక మంది వున్నారు. అలాంటి కొడుకులను కని, ఆ తల్లిదండ్రులు నిత్య నరకం చూస్తున్నారు. కడుపు తీపి ఎంత గొప్పదో ఒక్క అమ్మకు మాత్రమే తెలుసు. నాన్న కన్నీళ్లు ఒక్క ఆ హదయానికే తెలుసు. ఈ తరం కొడుకులకు ఆ తల్లి గురించి, ఆ తండ్రి కష్టం గురించి తెలియదు. వాళ్లు తల్లిదండ్రులైనా, వాళ్ల పిల్లల మీద వున్న మమకారంలో ఒక్క శాతం తన తల్లిదండ్రుల మీద లేకుండాపోతోంది. వారి తల్లిదండ్రులే చేదైపోతున్నారు. తల్లిదండ్రులంటేనే శత్రువులుగా చూస్తున్నారు. కళ్లముందున్న తల్లిదండ్రులను కష్టాల పాలు చేస్తూ, కన్నీళ్లు తెప్పిస్తూ, వారి రక్తం కళ్ల చూస్తున్న కొడుకులు దేవుడి గుడికి వెళ్లి పూజలు చేస్తుంటారు. సమాజంలో పెద్ద మనుషులగా చెలామణి అవుతున్న వారున్నారు. పూజలు, పునస్కారాలు, యాగాలు చేస్తుంటారు. పాపాలు పోవాలని గుడుల చుట్టూ తిరుగుతుంటారు. కాని తల్లిదండ్రుల విషయంలో అనుసరిస్తున్న వ్యవహారం పాపమని తెలిసినా, తప్ప్పుల మీద తప్ప్పులు చేస్తూ దేవుడా కని కొలుస్తుంటారు. కళ్లముందు కదలాడే దైవాలైన తల్లిదండ్రులను మాత్రం దెయ్యాలుగా చూస్తున్నారు. పిల్లల మీద ఆదారపడే పరిస్ధితి వచ్చే సరికి ఇక నరక లోకంలోకే వెళ్తున్నంత బతుకౌతుంది. తనను కన్న తల్లిదండ్రులకంటే, తను కన్న పిల్లల మీద మమకారం పెంచుకుంటున్నారు. తమ తల్లిదండ్రుల కళ్లలో కారం కొడుతున్నారు. వారి జీవితాలను శాపగ్రస్తం చేస్తున్నారు. శత్రువులకన్నా హీనంగా శిక్షిస్తున్నారు. తల్లిదండ్రులు కనిపెంచింది, తమ పిల్లలకే శత్రువులు కావడానికా..కన్న పిల్లల చేతే తన్నులు తినడానికా? కన్న పిల్లలే తల్లిదండ్రులను తోడేళ్లుగా పీక్కు తినేందుకా? సమాజమా? ఏటు పోతున్నావు..అని అడిగేవారు లేరు. సమాజంలో తల్లిదండ్రులను వేధిస్తున్న వారిని నిలదీసేవారు లేదు. మానవ సంఘాలు పనిచేయవు. ఏ వ్యవస్ధ ముందుకు రాదు. అందుకే చరిత్రలో మొదటిసారి సిఎం. రేవంత్రెడ్డి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీలో చట్టం చేసిన అమ్మానాన్నల జీవితాలకు భరోసా కల్పించాలని అనుకుంటున్నారు. తల్లిదండ్రులను ఎంత ఇబ్బందిపెట్టినా అదే పిల్లలకు ఏదైనా ఆపద వస్తే మళ్లీ విలవిలలాడిపోయేది ఆ తల్లిదండ్రులే..అలా తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్న వారిలో మెజార్టీ ప్రజలు ఉన్నత స్దాయిలో వున్నవాళ్లే..పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు అనేక మంది వున్నారు. సమాజానికి నీతులు వల్లిస్తూ, తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేస్తున్న దుర్మార్గులు, పులి తోలు కప్ప్పుకున్న నక్క లాంటి మోసగాళ్లు అనేక మంది కొడుకుల రూపాల్లో వున్నారు. కన్న పాపానికి నిత్య నరకం చూపిస్తూన్నాను. అమ్మానాన్నల పాలిట పరమ పాతకం చుట్టుకునేలా చే జేతులా చేసుకుంటున్నారు. తాము ముసలి వాళ్లౌతాము..అప్ప్పుడు కూడా మాకు ఇదే గతి వుంటుందన్న విషయం మర్చిపోయి, జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల కడుపులో కష్ణులుగా పుట్టాల్సిన కొడుకులు కొందరు కంసులౌతున్నారు. తల్లిదండ్రులనే చంపుతున్నారు.
