కొత్త కలెక్టర్, పై కోటి ఆశలు.

భూ అక్రమాలు, అక్రమ కట్టడాలు, పంట నష్ట పరిహారం

అందని ప్రభుత్వ పథకాలు,అక్రమార్కులపై కొరడా.

అధికారులపై చర్యలు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తోనే సాధ్యం.

వేయికళ్లతో ఎదురుచూస్తున్న మండల ప్రజలు.

మహాదేవపూర్ -నేటి ధాత్రి :

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా రాహుల్ శర్మ కు ప్రభుత్వం నియమించడంతో ఆదివారం కలెక్టర్ బాధ్యతలను స్వీకరించిన రాహుల్ శర్మ పై మహాదేవపూర్ ఉమ్మడి మండల ప్రజల తమ సమస్యలు ఇప్పుడైనా నెరవేరుతాయని కోటి ఆశతో ఎదురుచూడడం జరుగుతుంది. గత ప్రభుత్వం నుండి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయితున్నప్పటికీ, సమస్యలు మాత్రం ఉమ్మడి మండల ప్రజల కు వెంబడిస్తూనే ఉన్నాయని, అధికారుల నిర్లక్ష్యం పథకాల నుంచి పేద ప్రజలు దూరమవుతున్న పరిస్థితులు ఒకవైపు అయితే, ప్రభుత్వ భూములకు దళారులు కన్నేసి ఆక్రమించుకోవడం, పంచాయతీ చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో బహుళ నిర్మాణాలు చేపట్టడం, పంట నష్టం వైద్య సదుపాయం, పేదలకు కనుమరుగైన విద్య లాంటి అనేక సమస్యలు ఉమ్మడి మండల ప్రజల వెంటాడుతూనే ఉండడం, ప్రజావాణి సమస్యల పరిష్కార వేదికగా అనుకున్న పేదలకు ఉపయోగం లేకపోవడం, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడం ఉమ్మడి మండల పేద ప్రజలకు మరింత శాపంగా మారి, ఉచిత విద్యుత్ ,గ్యాస్ సబ్సిడీ ,కాగితాలకే పరిమితం కావడం తో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్పైనే మారుమూల ప్రాంతాల ప్రజలు ఇప్పుడైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.

 

మండలాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణ పెద్ద మొత్తంలో విక్రయం, ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ సర్వే నంబర్ 600 బంజరు, సర్వేనెంబర్ 473 పై తెలిపిన సర్వేనెంబర్ లకు ఆనుకొని ఉన్న మరికొన్ని ప్రభుత్వ భూములు అక్రమ పట్టాలు చేసి భారీగా విక్రయాలు చేస్తున్నారు. పంచాయితీ చట్టానికి విరుద్ధంగా పంచాయతీ అనుమతులు కొనకుండా పెద్ద మొత్తంలో విశాల భవనాల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు, కాళేశ్వరం మహాదేవపూర్ మండల కేంద్రం పలిమెల మండలంలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్లు సర్వేనెంబర్ 129 142 తో అక్రమ కట్టడాలు కట్టడం పెద్ద మొత్తంలో కొనసాగుతుంది. ప్రభుత్వ భూములు,కుంటలు ఆక్రమణ కొనసాగుతూ విక్రయాలు జరపడం, పంచాయతీ అనుమతి లేకుండానే అక్రమ కట్టడాలు కొనసాగించడం జరుగుతుంది. మండల కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు కొనసాగడం జరుగుతుంది. ప్రత్యేక అధికారులు కనుసైగల్లో ఈ వ్యవహారాలు కొనసాగుతున్నాయని ఉమ్మడి మండలమంతా కూడా వస్తుంది.

 

ఉమ్మడి మండలంలోని వ్యవసాయం చేస్తున్న రైతులకు, విద్యార్థులకు వ్యవసాయం విద్య వైద్యం అనేది ఒక అందని ద్రాక్షలా మారిపోయిందని చెప్పక తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యావత్ తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయం మరియు మంచి నీటి కొరకు మండలంలోని అంబటిపల్లి కన్నెపల్లి అన్నారం గ్రామాలకు కలిపి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లక్ష కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు చుక్క నీరు అందక అప్పు తెచ్చి పంటలను పండించుకున్న రైతులకు, ప్రాజెక్టు బ్యాక్ వాటర్ బారినపడి వేలఎకరాల వ్యవసాయం ముంపుకు గురికావడంతో ఉమ్మడి మండలంలోని రైతులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. 2021 సంవత్సరం లో మూడుసార్లు వచ్చిన అకాల వర్షాలు గులాబ్ తుఫాన్ కారణంగా ప్రతిసారి 18 నుండి 25 వేల ఎకరాల వరకు బ్యాక్ వాటర్ ముక్కుతో భారీ మొత్తంలో పంట నష్టం వాటిల్లింది ప్రాజెక్ట్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు జిల్లా అధికారులు పంట నష్టం సర్వే మాత్రం చేయడం ఆపడం లేదు కానీ సర్వే రిపోర్ట్ వచ్చినప్పటికీ ఇప్పటివరకు మండలంలోని రైతులకు పంట నష్టం పరిహారం మాత్రం తమకు వస్తుందన్నది ఒక కలగానే మిగిలిపోయింది.

ఉమ్మడి మండలంలో ప్రభుత్వ పాఠశాల అంటేనే విద్యార్థులకు గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ విద్య పై అసహ్యానికి గురి చేసేలా చేసింది విద్యాశాఖ, అయినప్పటికీ పేద ప్రజలు ప్రభుత్వ పాఠశాలను నమ్ముకొని తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నప్పటికీ మౌలిక వసతులు కరువై ఉపాధ్యాయుల నియమకం లేకపోవడం విద్యాధికారులు మారుమూల ప్రాంతాల పాఠశాలలపై దృష్టి పెట్టకపోవడం ఉమ్మడి మండలంలో సుమారు 45 పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడి దశలో ఉన్నప్పటికీ విద్యార్థులకు ఉన్న పాఠశాలలకు కూడా సముచిత ఉపాధ్యాయులు లేకపోవడం, మండల మరియు జిల్లా అధికారులు
పర్యవేక్షించకపోవడం కొత్త విద్య సంవత్సర ప్రారంభానికి కూడా అనేక పాఠశాలలు నోచుకోకపోవడం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల మౌలిక వసతులకు సంబంధించి నిర్మాణ పనులు నేటికీ కొనసాగడం పాఠశాలల్లో విద్యార్థులను చేర్చడంలో ఉపాధ్యాయులు విద్యాశాఖ నిర్లక్ష్యం నేడు మారుమూల ప్రాంత పేద విద్యార్థులకు విద్య కు నోచుకోకుండా ఉండటం ఉమ్మడి మండలంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అనేక సమస్యలు కలిగి ఉన్నాయి.

నాలుగు మండలాలతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని అహేరీ నియోజకవర్గంలోని 30 గ్రామాలకు సంబంధించిన ప్రజలు వైద్య సహాయం కోసం మహదేవ్పూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి రాక తప్పదు. ప్రభుత్వం దశాబ్దాల క్రితం మహదేవ్పూర్ సమితి గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన సామాజిక ఆసుపత్రి నాలుగు మండలాలు, పక్కరాష్ట్ర ప్రజలు దీనిపై ఆధారపడి ఉన్నప్పటికీ సామాజిక ఆసుపత్రి సరైన సదుపాయాలు లేకపోవడం, వైద్య పరీక్షలకు సంబంధించి అనేక పరికరాలు లేకపోవడం ప్రత్యేక విభాగానికి సంబంధించిన వైద్యుల ను,నియమించకపోవడం,మహిళలకు ప్రత్యేక వైద్యురాలు లేకపోవడం గర్భవతి మహిళలకు అత్యవసర సమయంలో ఆపరేషన్ కొరకు జిల్లా కేంద్రం లేదా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం జరుగుతుంది.

ఉమ్మడి మండలంలోని ఇందిరా కాంతి పథకం, అంగన్వాడి గిరిజన సహకార సంస్థ, చెరువుల సంరక్షణ ఇరిగేషన్ శాఖ రోడ్డు మరియు భవనాలకు సంబంధించి శాఖలు ప్రజలకు అందించవలసిన సదుపాయాలు పథకాలకు నోచుకోకుండా ఉన్నత అధికారులు మారుమూల ప్రాంతాల్లో ఆయా శాఖలకు సంబంధించిన కిందిస్థాయి అధికారుల పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన పథకాలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో కిందిస్థాయి అధికారులపై నిఘా ఉంచకపోవడంతో, అనేక శాఖల అధికారులు ప్రజలకు పథకాల నుండి గ్రామాల కు అభివృద్ధి నుండి దూరం చేయడంతో పాటు గ్రామాల్లో కనీస సౌకర్యాలను కూడా అందించడంలో విఫలం కావడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు ఆయా శాఖలకు సంబంధించి ప్రభుత్వం అందించిన అభివృద్ధి పథకాలు లేక గ్రామాల అభివృద్ధి పథకాలు ప్రజల వద్దకు ఇంతవరకు చేరాయని శాఖల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక రంగాన్ని సాగు చేసుకుని సమీక్ష సమావేశాలకు బదులు శాఖలకు సంబంధించిన గ్రూప్ లో వివరాలను అందించడం అంతా పేస్ట్ కాపీ ఇలాంటి వ్యవహారాలను కొనసాగిస్తూ అధికారులు గ్రామీణ ప్రాంతాల ప్రజలను అలాగే గ్రామాలను కాగితాల్లోనే అభివృద్ధి అని చూపడం వరకు పరిమితం చేయడం జరిగింది. మారుమూల ప్రాంతాల ప్రజల సమస్యలను నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని పసిగట్టి పథకాలు అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పనుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ పేద ప్రజలు కొత్త కలెక్టర్ పై పెట్టుకున్న నమ్మకాన్ని పథకాలను మహాదేవపూర్ ఉమ్మడి మండల ప్రజల వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటారని ఉమ్మడి మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!