
Shabbir Ali Narrowly Escapes Car Accident in Kamareddy
షబ్బీర్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం..!
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వేరే కారును తప్పించబోయి అనూహ్యంగా ఆయన కారు డివైడర్ను ఢీకొనడంతో..
కామారెడ్డి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కొద్దిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కారు డ్రైవర్ వేరే కారును తప్పించబోయాడు. కానీ, అనూహ్యంగా డివైడర్ను ఢీకొని కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో షబ్బీర్ అలీ కారులో లేకపోవడంతో ఆయనకు అపాయం తప్పింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ కొరకు స్థల పరిశీలన చేసేందుకు వచ్చిన మంత్రుల బృందంతో ఆయన కామారెడ్డి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ కారు ప్రమాదం చోటుచేసుకుంది.