కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24
చర్లపల్లి డివిజన్ లో
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని డివిజన్ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని ముందుగా ఆలోచించి యు జి డి వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ చర్లపల్లి డివిజన్ పరిధిలోని డెక్కన్ కాలనీ, కుషాయిగూడ , ఓల్డ్ విలేజ్, శ్రీ గణేశ్ కాలనీ, ఐజి కాలనీ, నేతాజీ నగర్ కాలనీ వివిద కాలనీలలో యు జి డి మరియు నీటీ సమస్యలు పై కాలనీ వాసులు ఇబ్బంది పడకూడదని కోరడం జరిగింది.
పలు కాలనీలలో మన్ హోల్ కవర్స్ లేని యు జి డి వల్ల కాలనీ ప్రజలకు అంటూ రోగ సమస్యలు వస్తున్నాయని తెలియజేయడం జరిగింది. యు జి డి పనులు ఎమర్జెన్సీ గా మొదలు పెట్టాలని, లేని యు జి డి లపై కవర్స్ వెంటనే అమర్చాలని ఆదేశించడం జరిగింది.
ప్రస్తుతం కాలనీ పరిధిలో పనిచేయ్యకుండా ఉన్న పవర్ బోర్లను వెంటనే రిపైర్ చేయాలని, అవసరమైన కాలనీ లలో వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందచేయాలని అధికారులను కోరడం జరిగింది.
ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ డి జి ఎం సతీష్ , ఏ ఈ రోహిత్ పాల్గొన్నారు.