మొగులపల్లి నేటి ధాత్రి
మండలంలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని వృతి చెందిన ఘటనకు సంబంధించి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్లపల్లికి చెందిన గుండారపు నరేష్ (35) గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతునికి గత 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి నరేష్ మద్యానికి బానిసగా మారడంతో.నరేష్ కు దూరంగా మూడు సంవత్సరాల పాటు పుట్టింటిలోనే ఉన్నది. రెండు నెలల క్రితమే కాపురానికి తిరిగి మొగుళ్లపల్లికి వచ్చింది. గత పది రోజులు నుండి మృతుడు నరేష్ ఇంట్లో డబ్బులు లేకుండా ఖర్చు పెట్టి అతిగా మద్యం సేవించడంతో. ఇంట్లో డబ్బులు లేక సరిగా పని దొరకకపోవడంతో తన భార్య తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. బుధవారం రోజున సాయంత్రం మృతుడు ఫోన్ చేసిన భార్య రాకపోవడంతో మృతుడు అతిగా మద్యం తాగిన మైకంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి గుండారపు వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బొరగల అశోక్ తెలిపారు.