ఇబ్బంది కరంగా మారిన గుంతలు
పరకాల నేటిధాత్రి
పట్టణంలో ప్రధాన రహదారి స్థానిక బస్టాండ్ కూడలి ప్రమాదకరంగా మారింది. క్రయవిక్రయాలతో వాహనాల రాకపోకలతో ఎల్లప్పుడూ రద్దిగా ఉండే ప్రదేశం గుంతలమయంగా మారింది. వర్షాలు అధికంగా పడుతున్న నేపథ్యంలో నిరునిల్వ ఉండటంతో గుంతలు కనుమరుగై ప్రమాదలకు దారితిస్తున్నాయి.భారీ వాహనాలు తిరుగుతుండే ప్రదేశం అవ్వడంతో గుంతలు రోజు రోజుకు అద్వానంగా మారుతున్నాయి.పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో రోడ్డు గుంతలతో కంకేరా తేలి అత్సవ్యస్తంగా మరింత ప్రమాదకరంగా మారింది.అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయించాలని వాహనదారులను ప్రమాదాల వలయం నుండి విముక్తులు గా చేయాలనీ కోరుతున్నారు.