
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామస్టేజి వద్ద సోమవారం రాత్రి తిర్మలాపూర్ గ్రామంలోని కారుపాకలపల్లె నుండి కరీంనగర్ మార్కెట్ కు మామిడికాయల లోడుతో ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నా క్రమంలో దేశరాజుపల్లి గ్రామ స్టేజి వద్దకు రాగానే ట్రాక్టర్ పంచర్ కావడంతో డ్రైవర్ పక్కకు ఆపి జాగ్రత్తలు తీసుకుంటున్న క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలకొండ గ్రామ చెరువులో నుండి ఇటుక బట్టీల కోసం (బద్దిపల్లి గ్రామానికి మట్టి తరలిస్తున్న)కరీంనగర్ వైపు వస్తున్న లారీ(నెంబర్ టీఎస్ 02యుసి 2525) ట్రాక్టర్ ముందు భాగం ఢీకొన్న క్రమంలో లారీ యొక్క రెండు చక్రాలు ఊడిపోయి పాల ట్యాంకర్ ను ఢీ కొట్టింది. లారీ ముందు భాగంలోని రెండు చక్రాలు ఊడిపోయి ప్రధాన రహదారిపై ఉండడంతో పోలీసులు తెల్లవారే దాకా అక్కడే ఉండి అనంతరం భారీ క్రేన్ సహాయంతో లారీని రోడ్డు పక్కకు తొలగించి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చేశారు. ఈప్రమాదంలో ట్రాక్టర్, పాలట్యాంకర్ ప్రమాదానికి గురయ్యాయి. ఈనెల 21న ఇదే స్థలంలో అతివేగంతో ఓకారు, ట్రాక్టర్ ను ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందడం జరిగినది. ఈఘటనలే కాకుండా ఇదే స్టేజి వద్ద ప్రతిరోజు ఏదో ఒక ప్రమాద సంఘటన జరుగుతూనే ఉంది. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి వెదిర ఎక్స్ రోడ్డు నుండి వెలిచాల ఎక్స్ రోడ్డు వరకు ప్రమాదాలకు నిలియంగా మారింది. అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న నాలుగు వాహనాలను సోమవారం రోజు ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని రామడుగు పోలీసులకు అప్పగించారు. ఈరోడ్డుపై ప్రతినిత్యం అక్రమంగా రవాణా చేస్తున్న మట్టి వాహనాలు జిల్లా కేంద్రానికి వెళుతున్న పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అతి వేగంతో ప్రతినిత్యం ఏదో ఒక ప్రమాద సంఘటన జరుగుతున్న రామడుగు పోలీసులు మాత్రం ఆకస్మిక తనిఖీలు చేయకుండా వదిలిపెడుతున్నారన్న విమర్శలు మండలంలోని ప్రజలలో పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈవిషయంలో జిల్లా పోలీస్ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.