లైబ్రరీ ఆవరణం దుర్వసన జల్లుతున్న పట్టింపులేదా
పరకాల నేటిధాత్రి పట్టణంలోని గ్రంథాలయంలోవివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న పాఠకుల పరిస్థితి దిన దిన గండంగా మారింది.అక్కడ పాములు,పిల్లులకు అవాసంగా మారి అక్కడ రోజూ భయాందోళనకు గురి అవుతూ ప్రిపేర్ అవుతున్నారు.ప్రతీ రోజు గ్రంథ పాలకునికి చెప్పినా కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అభ్యర్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.గ్రంథ పాలకుడు వచ్చేదే వారానికి రెండు రోజులు అందులో ఆయారం గాయారం అన్నట్టు ఉంటది ఆయన వ్యవహారమని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పాఠకులు వాపోతున్నారు.స్థానిక ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్ పరకాల లైబ్రరీలో సమస్యలు పరిష్కరించాలని,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న లైబ్రేరియన్ పై చర్యలు తీసుకోవాలని వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న పాఠకులు కోరుతున్నారు.