
మోడీ సర్కారు గద్దె దిగిపోవాలి.
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజా సంఘాల పిలుపు.సీపీఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొమరయ్య భవన్ నుండి,కార్ల మార్క్స్ కాలనీ సిక్స్ సింగ్ క్లీన్ బ్యారెక్స్ , గణేష్ చౌక్ మీదుగా, అంబేద్కర్ బొమ్మ నుండి, పోలీస్ స్టేషన్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ భారీ ర్యాలీలో సీపీఎం, సిపిఐ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఏఐటీయూసీ,సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, కెవిపిఎస్, ప్రజాతంత్ర మహిళా సమైక్య, సంఘాలు పాల్గొన్నాయి.
ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు, సిపిఐ జిల్లా నాయకుడు కేతరాజు సతీష్ , సిపిఐ ఎంఎల్ నూడెమ్మక్రసీ నాయకుడు చంద్రగిరి శంకర్, సిఐటి జిల్లా అధ్యక్షుడు కమిటీ రాజయ్య,ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలేము రాజేందర్ మాట్లాడుతూ మోడీ సర్కారు అనుసరించే కార్పోరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె బందు నిర్వహిస్తున్నామని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వడంలో లోపం జరిగింది. కార్మిక చట్టాలను సవరిస్తున్నాడు. పెట్టుబడుదారులకు అనుకూలంగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్నాడు. పేదల మీద భారాలు పెట్టుబడుదారులకు రాయితీలు ఇచ్చే అటువంటి పద్ధతిని మోడీ సర్కార్ అవలంబిస్తున్నాడు. రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాడు. కూలీల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాడు. ధరలు విపరీతంగా పెంచాడు. నచ్చడానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్న మోడీ ఒక్క ఉద్యోగాన్ని కూడా నింప లేదు. కొత్త పరిశ్రమలు లేవు కొత్త కొలువులు లేక నిరుద్యోగుల సంఖ్య పెరిగే ఆత్మహత్యల పాలవుతున్నారు. గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పడుతున్నాడు. జీరో అకౌంట్ లో 15 లక్షలు చేస్తామన్న మోడీ ఒక్క రూపాయి బిళ్ళ కూడా వేయక ప్రజలకు అన్యాయం చేశాడు. బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్, ఓడరేవులు, రైల్వేలు, విమానాలు, బొగ్గు రంగాన్ని, విద్య, వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు కారు చౌకకు అమ్మేస్తున్నాడు. చివరికి ఎర్రకోటానికి కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాధక్కం చేశాడు. ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగిన దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బందులో అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు బిజెపి కార్పొరేటు మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె గ్రామీణ బందులో కలిసి వచ్చాయని అన్నారు. ఈకార్యక్రమంలోఏఐటీయూసీ,సిఐటియు నుండి ఆకుదారి రమేష్, రవి కుమారు, గట్టు శంకర్, బిక్షపతి, వ్యవసాయ కార్మిక సంఘము నుండి పొలం చిన్న రాజేందర్, రైతు సంఘము నుండి రాధారపు మల్లయ్య, ఆదివాసి గిరిజన సంఘము నుండి గూడెల్లి శ్రీకాంత్, కెవిపిఎస్ నుండి శ్రీధర్, అఖిల భారత మహిళా ప్రజాతంత్ర సమైక్య నుండి వి లక్ష్మి, కొండ లక్ష్మి,సుజాత,ఆతుకూరి శ్రీకాంత్, స్వర్ణలత, కవిత, నవీను,రాజు, మరణ్, సుధాకర్, మడికొండ స్వామి, సదానందం, చీలపాక నరసయ్య, బక్కమ్మ,తదితరులు పాల్గొన్నారు