ముఖ్య అతిధిగా పాల్గొన్న దళితబంధు సాధన సమితి కన్వీనర్ ఏకు కార్తీక్
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గల అమరధామంలో గురువారం రోజున దళిత బందు సాధన సమితి కన్వీనర్ ఏకు కార్తీక్ ఆధ్వర్యంలో దళిత బంధు సాధన శాంతియుత నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోకిల మహేష్ హాజరయ్యారు. అనంతరం అమరధామం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి విగ్రహానికి నివాళులు అర్పించి వినతిపత్రాన్ని అందజేసి అనంతరం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసి నిధులను విడుదల చేయించాలని వినతి పత్రాన్ని అందజేశారు.దళిత బంధు బాధితులు వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రతి ఒక్క దళిత బిడ్డ ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ రమేష్,దామర జడ్పిటిసి కృష్ణమూర్తి,సంగెం మండల కోఆర్డినేటర్ శంకర్, నడికూడ మండలం నుండి చక్రపాణి,కోడేపాక భాస్కర్, పరకాల టౌన్ నుండి రఘుపతి, సుమన్,దేవేందర్ మరియు పరకాల నియోజవర్గం దళిత బందు లబ్ధిదారులు పాల్గొన్నారు.