
Mahagarjana Conference
వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సదస్సును జయప్రదం చేయండి
నేటిధాత్రి చర్ల
చర్ల మండలం వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు రేగళ్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఈనెల 24 న టీఎన్జీవో ఖమ్మం ఫంక్షన్ హాల్ నందు మహా గర్జన సన్నాహక సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సారధ్యంలో వికలాంగుల పెన్షన్ పెంచుటకు వితంతువుల చేయూత 4వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో వికలాంగులు మరియు వితంతువులు భారీ బహిరంగ సదస్సు నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాను వికలాంగులకు నెలసరి 6000 రూపాయలు ఇవ్వాలని వితంతువులకు 4 వేల రూపాయలు ఇవ్వాలని హెచ్ఐవి పేషెంట్లకు ఏఆర్టి పెన్షన్ పెంచాలని వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ గత ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి చర్ల మండలం వికలాంగులు వితంతువులు చేయుత పెన్షన్ దారులు ప్రతి ఒక్కరూ మరియు మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ నాయకులు భారీ సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మచ్చ రాజా వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నం రామ్మూర్తి మండల ప్రధాన కార్యదర్శి పూసం ముత్యాలరావు కార్తీక్ ఇల్లందుల జైరామ్ గుద్దేటి నాగరాజు బోయిల్లా ప్రవీణ్ సురేష్ రెడ్డి సతీష్ సాగర్ సుబ్రహ్మణ్యం శంకరాచారి కమల నానమ్మ తదితరులు పాల్గొన్నారు