
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామ ప్రజా సమస్యలపై ఆ గ్రామ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు.వృద్ధాప్య పింఛన్స్, కరెంట్ బిల్లు,రేషన్ కార్డు,గ్యాస్ బిల్లు, జాబ్ కార్డు,డ్రైనేజీ,తాగునీటి సమస్యల పట్ల గ్రామస్తులు సిపిఎం నాయకులకు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య,మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య,మండల నాయకులు పుచ్చకాయల నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పొన్నం రాజు, గ్రామ నాయకులు మహేందర్ రెడ్డి, మాదాసి శీను,శ్రీకాంత్,రమేష్, బత్తిని స్వామి, కొండబత్తుల నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు.