
వైన్స్ షాపుల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ మొగుళ్ళపల్లి. చిట్యాల. చల్లగారిగె. టేకుమట్ల రేగొండ మండలాలలో ఉన్నటువంటి వైన్ షాపులు విచ్చలవిడిగా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు బెల్టు షాపుల దగ్గర వైన్స్ షాపుల యజమాన్యం అధిక ధరలకు అమ్ముకుంటున్నారు యజమాన్యం విచ్చలవిడిగా వారికి ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముతున్నారు వీరి..దందా మూడు పూలు ఆరు కాయలు కాస్త ఉంది ప్రజల పైన అదనపు భారం పడతా ఉంది గ్రామాలలో బెల్ట్ షాపుల దగ్గరికి వెళితే అధిక ధరలకు అమ్ముకుంటున్నారు ఏ ఊరికి చూసినా ఏడు ఎనిమిది బెల్ట్ షాపుల దందా కొనసాగుతోంది ఎన్నికల కోడ్ నిబంధనలో ఉన్న వీరి.. దందా మాత్రం కొనసాగుతూనే ఉంది ఈ దందాను పట్టించుకున్న నాధుడే లేడు అటు ఎక్సైజ్ అధికారులు ఇటు స్థానిక పోలీసులు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు బెల్ట్ షాపుల దందాను అరికడదాం చెప్పినరాష్ట్ర ప్రభుత్వం అమలుకు మాత్రం నోచుకోవడం లేదు తక్షణమే ఈ దందాను అరికట్టి వైన్స్ షాపుల యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని బెల్ట్ షాపుల దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం