
CM Relief Fund Cheques
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో ఆదివారం సాయంత్రం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 11 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారికీ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గార్లకు చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ యం.పి.పిలు గుండారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ సోసైటి చైర్మన్ ధనసిరి.మల్లికార్జున్ రెడ్డి,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మాజీ జెడ్పీటీసీలు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,లబ్దిదారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.