
శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 17
మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన ఎస్ ఐ తీగల మాధవ్ గౌడ్ ను బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొడారి రమేష్ యాదవ్ శనివారం పోలీస్ స్టేషన్ లోని తన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి..శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. మండలంలో ఎలాంటి క్రైమ్ రేట్ పెరగకుండా ఉండేందుకు పోలీసులకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీ ఆర్ ఎస్ నాయకుడు ముడుపు రవీందర్ తదితరులున్నారు.