
కూకట్పల్లి, ఫిబ్రవరి 14 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ హైదరాబా ద్ అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వ ర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్ట మొదటి దళిత ముఖ్యమంత్రి దా మోదరాసంజీవయ్య 103వ జయం తి ని మూసాపేట్ గూడ్స్‌షెడ్ రోడ్ అంబేద్కర్ స్టేట్యూ వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర దళిత నాయకులు కర్క పెంట య్య విచ్చేసి అయన చిత్ర పటానికి ఫూల మాల వేసి ఘనంగా నివాళు లు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ సంజీవయ్య అత్యం త పెదకుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని అంచెలంచలు గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్య మంత్రిగా,మొదటి దళిత ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నిస్వార్థంగా సేవలందించారు.పేదరి క ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయారు.మాజీ ప్రధానులు పండిట్ జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ మన్నలను సంజీవయ్య పొందారు అని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో శారదారె డ్డి,అంబేద్కర్ అసోసి యేషన్ మాజీ అధ్యక్షులు కర్కడా కయ్య, కర్క రవీందర్,బిసి నాయకు లు భాశెట్టి నర్సింగరావు,జెల్ల రా ము,అసోసియేషన్ ప్రధానకార్య
దర్శి కర్కనిఖిల్,శ్రీనివాస్,,కర్క చిన్నసాయి,సదా మహేష్,కర్క మహేష్,పెరుమాండ్ల నర్సింగ్,
ఖాన్,బాషా తదితరులు పాల్గొ న్నారు.