ప్రపంచ హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ విగ్రహానికి ఘోర అవమానం

ఎంతో ప్రతిష్టగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముక్కలు చేసి మూలక్ పడగొట్టిన అధికారులు,,,,,,,

నాలుగు సంవత్సరాలు గడుస్తున్న తొలగించిన స్థానంలో ప్రతిష్టించని విగ్రహం,,,,,,

గతంలో క్రీడా సంఘాలు యువజన నాయకులు ప్రశ్నించిన పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు,,,,,,

మరిచిపోయి మరుగున పడవేసి స్టేడియంలో క్రీడలు కొనసాగిస్తున్న క్రీడా అధికారులు,,,,,,

మళ్లీ యధా స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని క్రీడా సంఘాల నాయకుల డిమాండ్,,,,,

లేకుంటే చట్ట చర్యలకు ముందుకు వెళ్తామంటున్న క్రీడా సంఘాల నాయకులు,,,,,,

రాష్ట్రవ్యాప్త ఆందోళనలో ఉత్తమ క్రీడా కారుని అవమానాన్ని విస్తరిస్తామంటున్న క్రీడా సంఘాలు,,,,,,

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.

ప్రపంచం క్రీడా చరిత్రలో భారతదేశం అట్టడుగు స్థానాన ఏ ఒలంపిక్ లో కూడా సరైన ప్రదర్శనలు లేక వేలవేలపోయి 100 కోట్ల పైగా జనాభా ఉన్న చిన్న సోమాలియా దేశం తో పోటీ పడలేని పరిస్థితిలో క్రీడలు కొనసాగిస్తున్న సమయంలో ప్రపంచంలోనే భారత దేశ సత్తా శక్తులను చూపెట్టి అత్యుత్తమ క్రీడాకారుడిగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన మేజర్ లెజెండ్ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జీవిత చరిత్ర ఈరోజు విద్యార్థులకు క్రీడాకారులకు ఆదర్శంగా పాఠ్యాంశాలుగా చెప్పబడుతున్న కొన్నిచోట్ల అతని ప్రతిష్టకు దేశ క్రీడా ప్రతిష్టకు భంగం కలిగే సంఘటనలు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో చోటు చేసుకున్నది గత 16 సంవత్సరాల క్రితం జిల్లా క్రీడా సంఘాలు ఎంతో ప్రతిష్టగా తెలంగాణ రాష్ట్రంలోని రెండవ విగ్రహాన్ని మెదక్ పట్టణం ఇంద్ర గాంధీ స్టేడియం ఎదురుగా నాలుగు రోడ్ల కూడలిలో కంచు విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది ప్రతి ఆయన జయంతికి క్రీడా సంఘాలు నివాళులర్పించి క్రీడాకారులకు స్ఫూర్తిగా ఆయన గురించి చెప్పడం క్రీడల్లో అభివృద్ధికి ముందుకు వెళ్లడానికి దోహదం చేస్తుందని క్రీడా సంఘాలు భావిస్తూ ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఆయన విగ్రహం వద్ద జరపడం జరుగుతుంది కానీ గతంలో నాలుగు సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసి అధికారులు ఏదో కారణం చెప్పి అక్కడ క్రాక్ టవర్ ఏర్పాటు చేస్తామని ఎంతో గౌరవం తో అధికారికంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ముక్కలు చేసి తొలగించి ఇప్పటివరకు కూడా స్టేడియంలో మూలన పడవేయడం అవమానకరమైన సంఘటనగా క్రీడా సంఘాలు భావిస్తున్నాయి ఒక రాజకీయ పార్టీ కానీ ఇతర కుల సంఘాలకు కానీ తమ తమ ఉన్నత నాయకులకు చిన్న అవమానం జరిగితే దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్త ఆందోళనలు దానిపై కోర్టుకు పోలీస్ స్టేషన్కు వెళ్లడం జరుగుతుంది అలానే క్రీడా సంఘాల అత్యున్నత గొప్ప మార్గదర్శి మరియు ప్రపంచంలోనే క్రీడలకు లెజెండ్ గా ఉన్న విగ్రహాన్ని అవమాన పట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవద్దని ఎందుకు చట్టపరమైన చర్యలకు పోవద్దని క్రీడా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఈ సంఘటనపై మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామాయంపేట యువజన సంఘాల తాలూకా గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ఇది భారతదేశ క్రీడా జగత్తుకే గోరా అవమానం అన్నారు అధికారులకు ఇంతవరకు కూడా ఏమంత ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పటివరకు తొలగించిన ప్రాంతం ఖాళీగా ఉన్న విగ్రహాన్ని అవమానపర్తి విడగొట్టిన ఇంతకుముందు గతంలో నేను కూడా వార్తల ద్వారా మీడియా ద్వారా హెచ్చరించిన పట్టించుకోలేదన్నారు ప్రత్యక్షంగా కొందరి జిహెచ్ఎంసి అధికారులతో క్రీడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందన్నారు వారు త్వరలోనే ఏర్పాటు చేస్తామని సంవత్సరాలు గడిచిన మళ్లీ ఆ విగ్రహాన్ని అలానే అవమానపరచడం అక్కడే ఉంచడం క్షమించరాదు అన్నారు ఈ విషయంపై ఆయన ఒక నెలలోనే విగ్రహాన్ని నూతనంగా అక్కడ ప్రతిష్టించడం జరగాలని కోరారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారిని కూడా కలిసి మెమొరం ఇవ్వడం జరుగుతుందన్నారు దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలని కొడతామని ఆయన అన్నారు ఇప్పటికైనా క్రీడా అధికారులు జిహెచ్ఎంసి అధికారులు తొలగించిన ప్రాంతంలోని నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!