మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం..
—కె.మాణిక్ఆవు, ఎమ్మెల్యే, జహీరాబాద్
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథ కాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా రైతులకు అన్యాయం చేస్తున్నది. సంగమే శ్వర ఎత్తిపోతల పథకంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరా బాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగు డంపల్లి మండలాల పరిధిలోని 115 గ్రామా ల్లోని 1,03,259 ఎకరాలకు సాగు నీరందిం చేందుకు లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ హయాంలో భూమి పూజ చేశాం. మునిపల్లి మండలంలోని చిన్నచల్మెడలో పంపుహౌస్ కోసం భూమి పూజ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగమేశ్వర ఎత్తిపోతల పథ కాన్ని అడ్డుకుంటున్నది. వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అనేకసార్లు దీనిపై అసెంబ్లీలో విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జహీరాబాద్ ప్రాంత నిరుద్యోగు లకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ చేపడుతున్న నిమ్స్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యం కలి గిన రంగాలకు నిధులు కేటా యింపు ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా వ్యవసాయం, పారిశ్రా మిక రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర బలహీనవర్గాలకు కేటాయింపులు తగ్గాయి. ప్రస్తుతం ఇచ్చిన నిధులతోనైనా సకాలంలో పనులు చేపడితేనే ప్రజలకు ప్రయోజనం కలుగు తుంది. జహీరాబాద్ నియోజకవర్గంలో నిష్ణా ప్రాజెక్టు తోపాటు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధు లను విస్మరించారు.