
వనపర్తి నేటిధాత్రి ;
చెట్లను కాపాడండి చెట్లను పెంచండి అనే కార్యక్రమంతో అలంపూర్ నుండి హైదరాబాద్ కు పాదయాత్ర లో ఉన్న స్నేక్ సొసైటీ అధ్యక్షులు కృష్ణ సాగర్ వనపర్తి కి వచ్చారు . ఈ సందర్భంగా పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం శాలువతో ఘనంగా సన్మానించారు బిజెపి కార్యాలయంలో రెండు చెట్లను ఆయనతో నాటించారు పోలీస్ స్టేషన్ లో రూరల్ జలంధర్ రెడ్డి సమక్షంలో కృష్ణ సాగర్ తో చెట్లను నాటించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ ఈసీ మెంబర్ గోనూరు యాదగిరి గుప్తా ముత్తుస్వామి బిజెపి నాయకులు విజయ సాగర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కృష్ణ సాగర్ పాదయాత్ర చేపట్టడంపై బచ్చురాం గో నూరు యాదగిరి అభినందించారు .