ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 2009-10 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాలలో చదువుకోని మృతి చెందిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులని స్మరించుకొని ముందుగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరము పూర్వ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు 15 సంవత్సరాల తరువాత కలుసుకోవడం సంతోషం గ ఉంది అని పూర్వ విద్యార్థులు అందరు నెమరు వేసుకున్నరు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేసి జ్ఞాపికలను అందచేశారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు సారంగపాణి, నరేందర్, రవీందర్, రాధిక, సరిత, రమేష్, సుధాకర్, హాజీ, బలరాం, కుమార్, ప్రకాష్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!