నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ భూనీల గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంకటాచార్యులు అమ్మవారి వైభవాన్ని గురించి చాలా క్లుప్తంగా వివరించారు గోదాదేవి ఎవరో కాదు వైకుంఠం నుంచి దిగివచ్చిన ఆ లక్ష్మీదేవి అని ఈ సందర్భంగా తెలిపారు ధనుర్మాస ఉత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని ఈ ధనుర్మాస వ్రతం మానవాళికి ఎంతో శ్రేయస్కారమని తెలిపారు
కార్యక్రమం భక్తుల గోవింద నామస్మరణతో మారు మోగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు