
"Bhaktanjeneya Swamy Temple Builders Honored"
గుడి నిర్మాణానికి కృషి చేసిన వారికి ఘన సన్మానం
మహాదేవపూర్ సెప్టెంబర్ 1 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం రాపల్లికోట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి గుడి నిర్మాణానికి కృషి చేసిన వారికి ఉడుత ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. రాపల్లి కోట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి గుడి ప్రారంభం నుండి ఒక కమిటీ వేసి హర్నిశలు కృషిచేసి ప్రజలను భక్తులను మెప్పించి అందరి కృషితో గుడి నిర్మాణం పూర్తి చేసి గ్రామ ప్రజలకు భక్తాంజనేయ స్వామి ఆశీర్వాదాలు అందేలా కృషి చేసిన సభ్యులు పంచక వెంకటస్వామి కాటవైన సమ్మయ్య, అప్పల సారయ్య, కల్ల గట్టయ్య, బక్కతట్ల రాజలింగు, అట్టెం పోచయ్య మరియు బొగ్గుల చంద్రయ్య లను నూతనంగా ఏర్పడిన ఆలయ చైర్మన్ బొగ్గుల తిరుపతి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అప్పల ప్రశాంత్, భట్టి శ్రీశైలం, బల్ల అశోక్, కాట్రేవుల లక్ష్మీనారాయణ, కళ్ళ అరవింద్, అట్టం ప్రవీణ్, మేకల వంశీ, బట్టి కోటేష్, అక్కినేని రమాకాంత్, మరవిన్ రవితేజ, అర్చకులు, భక్తులు, ప్రజలు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.