Tribute to Poet Andesri
సహజకవి అందెశ్రీ కి ఘన నివాళి.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండలం లోని చల్లగరిగ గ్రామ అంబెడ్కర్ చౌరస్తా లో సామాజిక కార్యకర్త, అంబెడ్కర్ ఫేలోషిప్ అవార్డు గ్రహీత నోముల శివశంకర్ గారి ఆధ్వర్యంలో , స్వర్గియ,డాక్టర్ అందెశ్రీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చల్లగరిగ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పిఆర్ టియు చిట్యాల మండలం అధ్యక్షులు శ్రీ బండి శ్రీనివాస్ పాల్గొని అందెశ్రీ గారి చిత్ర పటానికి పూల మాల వేసి రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు…. అనంతరం ప్రసంగిస్తూ
అందెశ్రీ గారిని ప్రకృతి కవిగా అభివర్ణించారు,అయన తెలంగాణ మలి దశ ఉద్యమ పాటలు వ్రాసి, పాడి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి, తన పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించినారు , తను వ్రాసిన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను ప్రభుత్వం గుర్తించి ప్రార్థన గీతంగా ఆలపిస్తున్నారాని ఆయన గురించి కొనియాడారు… ఈ కార్యక్రమంలో మాజీ జంక్ ఎస్ ఏం సి ఛైర్మన్ మ్యాదరి వీరాస్వామి, యూత్ నాయకులు కొల్లూరి అశోక్, రామస్వామి, సోమిడి రఘుపతి, ఎస్.వెంకటప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.
