Tribute to Mothers at Talent Bloom School
ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ హైస్కూల్లో ఘనంగా అమ్మకు వందనం.
కోదాడ, నేటి ధాత్రి :
విద్యార్థు ల్లో తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని విశ్రాంత ఉపన్యాసకులు సాహితీవేత్త శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని నయా నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ హైస్కూల్ లో అమ్మకు వందనం కార్యక్రమం సందర్భంగా పాఠశాల చైర్మన్ యం.డి షేర్ అలీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ. విద్యార్థుల్లో తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే అమ్మ కు వందనం కార్య క్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. నైతిక విలువలకు పునాది పాఠశాల అని , నైతిక విలువలు విద్యార్ధుల్లో పెంపొందించేందు కు ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ చేస్తున్న కృషి ప్రశంస నీయం అన్నారు. ఒక మంచి తల్లి వంద మంది ఉపాధ్యాయుల తో సమానం అన్నారు.తల్లి దండ్రులు దైవం తో సమానం అన్నారు. మరో ముఖ్య అతిథి రచయిత సంఘం అధ్యక్షుడు పుప్పాల కృష్ణ మూర్తి మాట్లాడుతూ అమ్మ విలువ అందనంత దూరంలో వున్నప్పుడే అర్ధం అవుతుందన్నారు. తల్లి దండ్రుల ను మరవద్దన్నారు. తల్లి దండ్రుల ను చూసే బాధ్యత పిల్లల దే అన్నారు. తల్లి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేని దన్నారు. అనంతరం తల్లి దండ్రులకు విద్యార్ధులు పాద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ గూడెం హై స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సత్తార్, పీఎం శ్రీ జిల్లా పరిషత్ స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు శ్రీమతి షేక్ రెహానా బేగం విద్యార్ధుల తల్లి దండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
