టాలెంట్ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
మందమర్రి, నేటిధాత్రి:-
టాలెంట్ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, నృత్య కళా వైభవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని ఎస్వీ కన్వెన్షన్ హాల్ లో టాలెంట్ నృత్య కళా నిలయం కళాకారుడు సుధాకర్ రాంబాబు ఆధ్వర్యంలో నృత్య కళా వైభవం 2023, బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుము జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెంబెర్ ఉదారి చంద్ర మోహన్ గౌడ్, దుర్గం పోషం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుర్గం రాజేష్, కిసాన్ భారత్ చైర్మన్ కుమార స్వామి, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమౌళి, లయన్స్ క్లబ్ చంద్రమౌళి, గ్రాండ్ మాస్టర్ జూపాక గోపి హాజరయ్యి నటరాజ విగ్రహానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం నృత్య కళాకారులకు నాట్య కళా ప్రపూర్ణ పురస్కారం, నృత్య గురువులకు నాట్య శిరోమణి పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నృత్య రంగంలో అందరూ ఉన్నతంగా రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాన్స్ మాస్టర్ రమణ, సీనియర్ కళాకారులు బియ్యల ఉపేందర్, రాజేష్, బొరుకంట రాజు, డాన్స్ మాస్టర్స్ వసుద, మోహిని, ఖాజా, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.