Govt Officer Promotes Road Safety on Cycle
సైకిల్ పై హెల్మెట్ ధరించి వెళ్తూ నేటి ధాత్రి కెమెరా లో చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి
సమాజానికి ఆదర్శవంతంగా నిలిచిన
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కోటి వెంకటేశ్వర్లు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ లో సైకిల్ పై ప్రయాణిస్తూ హెల్మెట్ ధరించి వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగి శనివారం నేటి ధాత్రి కెమెరాకి చిక్కారు.నేటి ధాత్రి రిపోర్టర్ నరేష్ గౌడ్ వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు.తన పేరు కోటి వెంకటేశ్వర్లు గ్రూప్ 2 ఆఫీసర్ అయినటువంటి అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా మంచిర్యాల,ఆసిఫాబాద్ సిటిఓ ఆఫీసులో వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.తను ఒక ప్రభుత్వ ఉద్యోగి అని వారికి కారు,బైకు ఉన్నప్పటికీ కాలుష్యాన్ని తగ్గించాలని మంచి ఆలోచనతో అప్పుడప్పుడు తన నివాసం శ్రీరాంపూర్ నుండి మంచిర్యాల్ వరకు సైకిల్ పై హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తుంటానని,అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, బైకుపై హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తూ నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని,హెల్మెట్ ధరించి చేసే ప్రయాణంలో ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించిన ప్రాణాలతో బయటపడవచ్చునని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్లు తెలిపారు.వారు ఈ విధంగా ప్రయాణం చేయడం వల్ల కొంత మందిలో నైనా మార్పు వస్తుందన్న నమ్మకంతో హెల్మెట్ ధరించి సైకిల్ పై ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు.
