భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా భద్రాచలం…
భద్రాచలం నేటి ధాత్రి
బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్న ఆపకుండా పారిపోతున్న లారీ నీ ప్రభుత్వ జూనియర్ కాలేజి వద్ద అడ్డుకుని సుమారు 285 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేసిన సివిల్ సప్లయిస్ అధికారి సుంకరి శ్రీనివాస్.
రేషన్ బియ్యాన్ని జీసీసీ గోడౌన్ కు తరలించి లారీని పి ఎస్ కు తరలించిన సివిల్ సప్లై అధికారి.
భారీ మొత్తం లో రేషన్ బియ్యం పట్టివేత.
పేద ప్రజల బియ్యం పక్క దారి పడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.కానీ సుమారు 285 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఇలా పెద్ద మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసారు సివిల్ సప్లై అధికారులు.
ఈరోజు తెల్లవారు జామున సివిల్ సప్లై అధికారులు గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద తనిఖీ లు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళుతున్న ఛత్తీస్ ఘడ్ లారీని ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ లారీ ఆపకుండా పారిపోతున్న సమయంలో వెంబడించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో లారీని అడ్డుకుని ప్రశ్నించగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుసుకుని రేషన్ బియ్యాన్ని జిసిసి గోడౌన్ కు తరలించి కేసు నమోదు చేసి లారీ నీ .పి .ఎస్ కు తరలించిన సివిల్ సప్లై అధికారులు.
రేషన్ బియ్యం విలువ సుమారు 10 లక్షలు ఉంటుంది అని తెలిపారు అధికారులు.
బైట్.DT శ్రీనివాస్.