భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ఎం సత్యనారాయణ భార్య రమాదేవికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబా దులో ఆపరేషన్ చేయించడం జరిగింది.
ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయడం కోసం రోజుకు 30 వేల వరకు ఖర్చు అవుతుంది.
ఆపరేషన్‌కు చాలా నగదు ఖర్చు కావడంతోపాటు ప్రతి రోజు 30000 పెట్టుకోవడం కష్టంగా మారి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తోటి హోంగార్డు డ్రైవర్ జే. కోటేశ్వరరావు ఈరోజు వైద్య ఖర్చులకు 10,000 ఆర్థిక సాయం అందజేశారు. హోంగార్డ్ ఆఫీస్ రైటర్ డి శేషు ద్వారా ఈ నగదు అందజేశారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న హోంగార్డు భార్య వైద్య ఖర్చులకు దాతలు ఆర్థిక సహయం అందించాలని జే. కోటేశ్వరరావు కోరారు.