
Mandala Murders.
ఓటీటీకి.. వణుకు పుట్టించే డార్క్ మైథలాజికల్ థ్రిల్లర్! ఎందులో అంటే
చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ మండల మర్డర్స్ డిజిట్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ మండల మర్డర్స్ (Mandala Murders) డిజిట్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. క్రైమ్, మర్టర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సిరీస్ రాక కోసం చాలామంది సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. గతంలో హిందీ నుంచే వచ్చి కల్ట్ బ్లాక్ బస్టర్‌గా పేరు తెచ్చుకున్న అసుర్ తరహా కాన్పెస్ట్‌తో ఈ సిరీస్ తెరకెక్కింది. యశ్ రాజ్ సంస్థ ఆస్థాన కథానాయిక బాలీవుడ్ నటి వాణీ కపూర్ (Vaani Kapoor) లీడ్ రోల్లో నటిస్తుండగా సుర్వీన్ చావ్లా (Surveen Chawla), శ్రీయ పిగ్లోంకర్ (Shriya Pilgaonkar), వైభవ్ రాజ్ గుప్తా (Vaibhav Raj Gupta) కీలక పాత్రల్లో నటించారు.
తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను దక్కించుకోవడమే వెంటనే చూసేయాలి అనే ఫీలింగ్‌ను తెప్పించేలా ఉంది. ముఖ్యంగా వరుస హత్యలు, వాటికి దైవానికి మధ్య లింకులు ఎపిసోడ్ ఎపిసోడ్‌కు వచ్చే ట్విస్టులు మైండ్ బ్లాక్ చేసేలా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ జూలై 25 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్కు రానుంది. ఎంతో కాలంగా అసుర్ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కంటెంట్ అశిస్తున్న వారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్. సో సినీ, ఓటీటీ లవర్స్ డోంట్ మిస్ మండల (Mandala Murders) మర్డర్స్.