అధికారుల ఏమరపాటు అనుకోవాలా..
కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం అనుకోవాలా..
ఎవరిది తప్పైనా ప్రజలే ఇబ్బంది పడాలా..
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రం నుండి శివ్వారం వరకు ఉన్నటువంటి రహదారి పెగడపల్లి గ్రామ పరిధిలోని ఈదుల వాగు వద్ద రోడ్డు అస్తవ్యస్తంగా గుంతల మయంగా ఉండటం దాంతోపాటు రహదారి మధ్యన విద్యుత్ స్తంభం ఉండడం ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. నిత్యం రాకపోకలు జరిగేటువంటి దారికి ఇలా మధ్యలో విద్యుత్ స్తంభం ఉండడం చాలా ప్రమాదకరమని ప్రయాణికులు వాపోతున్నారు.రాత్రిపూట చీకటిలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు,రోడ్డు రవాణా వ్యవస్థ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.