•గత సంవత్సర కాలంగా పరిష్కారం కానీ సమస్య.
•లైన్మెన్ వీరన్న కు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు.
•పలుమార్లు చెప్పిన పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు.
•ఊరికి సమీపంలో ఉండడం వలన భయాందోళనలో గ్రామ ప్రజలు.
•అటుగా చూడకుండా వెళ్లిన మూగజీవాలు, మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది.
•పట్టుకుంటే చేతికి అందే అంత కింద ఉన్న కరెంటు తీగలు
వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటే ప్రమాద ల నుంచి బయటపడవచ్చు అంటున్న గ్రామ రైతులు.
మరిపెడ నేటి దాత్రి.
మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామంలో గ్రామ శివారులో ఉన్న నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం వెనకాల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుండి వెళ్లినటువంటి లైను లో మొదట రెండు స్తంభాలు వేయవలసిన దూరంలో ఒకటే స్తంభం వేయడం వలన కరెంటు తీగలు కొంత కాలానికి లూస్ అయ్యి కిందికి వేలాడడం జరిగింది అయితే ఈ సమస్యను పరిష్కరించాలి అని గత కొంతకాలంగా అంటే దాదాపుగా సంవత్సరం క్రింద విద్యుత్ శాఖ వారికి అక్కడ ఉన్నటువంటి రైతులు మా సమస్యను పరిష్కరించాలి అని ఒక లెటర్ రాయడం జరిగింది పలుమార్లు గ్రామానికి సంబంధించిన లైన్మెన్ ని ఈ సమస్యపై సంప్రదించడం జరిగింది అయినా కూడా విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ వారు గానీ గ్రామానికి సంబంధించినటువంటి లైన్మెన్ గానీ ఎవరు పట్టించుకోవడం లేదు అని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వాపోతున్నారు గ్రామానికి దగ్గరగా ఉండడం వలన అటుగా వెళ్లే మనుషులు గాని మూగజీవాలు గాని విద్యుత్ తీగలు తగిలి మరణించే అవకాశం ఉంది అయినా సరే పలుమార్లు అధికారులకు చెప్పిన నిమ్మకు నీరు ఎత్తినట్టే ఉంటున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లూజ్ పోల్స్ వేయాలి అని పలుమార్లు విజ్ఞప్తి చేసిన సమస్యను దాటవేస్తున్నారు అని అక్కడ జరగకూడనిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖ వారే వహించవలసి ఉంటుంది అన్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేకపోతే త్వరలోనే విద్యుత్ శాఖ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతాం అన్నారు, ఈ కార్యక్రమంలో గుండగాని. లింగరాజు, గణేష్, గుండాగాని. రమేష్, భద్రు తదితరులు పాల్గొన్నారు.