శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అరుణ అక్క నగర్ ఏడవ వార్డులో త్రాగునీటి సమస్య ఉందని కాలనీవాసులు స్థానిక వార్డు కౌన్సిలర్ చిడం మహేష్ కి తెలపగా వారు వెంటనే స్పందించి శుక్రవారం కొత్త మోటర్ బిగించి కాలనీ వాసుల నీటి సమస్యను తీర్చారు.నీటి సమస్య తీర్చిన వార్డు కౌన్సిలర్ కి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.