వార్డుప్రజలు సంతోషంగా ఉండాలని భక్తంజానేయ స్వామి ఆలయంలో పూజలు
పరకాల నేటిధాత్రి
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ సోమవారం రోజున ప్రతిఒక్కరు ఇంటిపై కాషాయంజెండా ఎగరావేసి కార్యక్రమం వీక్షించి దైవ దర్శనం చేసుకోవాలని అన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు 21వ వార్డు కౌన్సిలర్ ఆర్పీ జయంత్ లాల్ తన వంతు రామకార్యంగా 21వ వార్డులో నివాసం ఉంటున్న ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగరవేయాలని ఆలోచనతో ఇంటి ముందు దీపావళి జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి ఒక ధ్వజంతో పాటు దీపావళి కాకర పుల్లాలు వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కాషాయ ధ్వజాలను స్థానిక మలకపేటలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కాటూరి జగన్నాథచార్యులు,శరత్ కుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వార్డు ప్రయోలందరూ శ్రీ రాముని ఆశీస్సులతో సుభిక్షంగా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని శ్రీరాములు శ్రీరామునికి పూజించినట్లు తెలిపారు 1116 ధ్వజాలు ఉచితంగా వార్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజలకు వితరణ చేయును అన్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మరాటి నరసింహారావు,వెలిశెట్టి రాజేష్,పాలకుర్తి తిరుపతి, మెండు రాజశేఖర్,సూర్య, రాహుల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.