
.. ఓట్లు తిట్లు తప్ప చేసిందేమీ లేదు.
.. సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలం.
.. బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్.కె హైమద్.. / రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. /
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పరిపాలనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు ఎస్.కె హైమద్ ఆరోపించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం ఓట్లు తిట్లు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా పరిపాలన పై దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఎన్నికల్లో వచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అందడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు బీమా గాని, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకా లతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఉచిత బస్సు పేరిట ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టి సకాలంలో ప్రయాణికులకు బస్సులు అందని దుస్థితి తీసుకురావడం జరిగిందన్నారు. చాలా చోట్ల మహిళలు బస్సులోని కొట్టుకునే పరిస్థితి దాపురించిందన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని మాయమాటలు చెప్పి ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని, రైతుల గురించి పట్టించుకోవడం ప్రభుత్వ మర్చిపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ప్రస్తుతం నమ్మకం పోయిందన్నారు. ఇప్పటికైనా కొందరు ఇట్లు తిట్లు మానుకొని ప్రజల సంక్షేమ కోసం ఆలోచించాలని అన్నారు.