సిగాసి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.
ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్
నర్సంపేట,నేటిధాత్రి:
సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారంలోని సిగాసి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం అనేకమంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని ఐఎఫ్ టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పనిలో ఉన్నారని వారి రక్షణకై యుద్ధప్రాతిపదికపై మరింతగా అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని,
ఈ దుర్ఘటనలో లేబర్ అధికారుల,ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైందని పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ లేకపోవడం వలన జరిగిందని ఐఎఫ్టియు అభిప్రాయపడుతుందని తెలిపారు.

మరణించిన క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు.
సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి,బిఎన్ఎస్ఎస్
సెక్షన్ 106 లేదా సెక్షన్ 107 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని .
మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని, తీవ్రంగా క్షతగాత్రులైన కార్మికులకు ఒకరికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ స్థాయి లో వైద్యాన్ని ప్రభుత్వ పరివేక్షణలో యాజమాన్యం మరియు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారు( కార్మికులు) సంపూర్ణంగా కోరుకునే వరకు అందించాలని రాష్ట్ర కమిటీ తరుపున కోరారు.
ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నట్లు ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ ప్రకటించారు.