డి ఐ ఈ ఓ బహిరంగంగా నోటీసులను జారీ చేయాలి
బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్
హన్మకొండ, నేటిధాత్రి:
హనుమకొండ డబ్బాల ప్రాంతంలో ఉన్న ఏకశిలా జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతున్న శ్రీదేవి అనే విద్యార్థిని కళాశాలలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన పైన న్యాయ విచారణ జరపాలి.
జిల్లా అధ్యక్షులు మంద సురేష్
మాట్లాడుతూ తల్లిదండ్రులకు మరి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మార్చరి కి ఎలా తరలించారు దానిపైన కూడా అధికారులు ఎందుకు విచారణ చేపట్టడం లేదు ఇవన్నీ అధికారులు దృష్టిలో పెట్టుకొని ఏకశిలా చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని
ప్రధానంగా అధికారులను డిమాండ్ చేస్తున్నాం.
డి ఐ ఈ ఓ బహిరంగంగా న్యాయ విచారణ జరుపకకపోతే
ఆర్ జె టి ఆఫీసులు ముట్టడి చేస్తాం అని మంద సురేష్ అధికారులపై మండిపడ్డారు