సమన్యాయం కోసం సమగ్ర కుల గణన బి.సిల చిరకాల కోరిక_

ఆచార్య కూరపాటి వెంకటనారాయణ

తెలంగాణ రాష్ట్రం లో బి. సి. కులాల సమన్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన కు ముందు కు రావడాన్ని స్వాగతిస్తున్నామని బి.సి. కులాల ఐక్య వేదిక నాయకులు, రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల చైర్మన్ ప్రొఫెసర్ కె. వెంకట్ నారాయణ అన్నారు. కాకతీయ విశ్వ విద్యాలయం దూర విద్యా కేంద్రం ప్రాంగణం లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సమావేశానికి బీసీ ఐక్యవేదిక నాయకులు,పాస్ వ్యవస్ధాక అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అధ్యక్షత వహించారు. మీడియా సమావేశం కు ముందు కె. యు. దూర విద్యా కేంద్రం ప్రాంగణం లో ఉన్న జ్యోతిరావు ఫూలే, సావిత్రిభాయి ఫూలే విగ్రహాలను పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కె. వెంకట్ నారాయణ మాట్లాడుతూ 1931 లో జనగణన జరిగిందని, ఆ తర్వాత అనేక మార్లు జనాభా గణనలు జరిగినా ఓబీసీ కులగణన జరగలేదు. బీసీల కోసం చాకలి ఐలమ్మ, సర్దార్ గౌతు లచ్చన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్వాయి పాపన్న లాంటి వాళ్ళు పోరాడారని ఆయన అన్నారు. ఏ. ఐ. సి. సి. మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సమగ్ర కుల గణన చేపడతాం అని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సిఎం రేవంత్ రెడ్డి సమగ్ర కుల గణన చేపడతామని శాసన సభ కులగణన బిల్లు ప్రవేశ పెట్టి, ఆమోదింపజేశారు. దీనితో బి సి ల్లో ఆశలు చిగురించాయని ఆయన వ్యాఖ్యానించారు.బీ. సీ.కులాల సమగ్ర గణాన జరిగితే , వారికి విద్య , ఉద్యోగ, రాజకీయ, రంగాలలో దక్కాల్సిన వాటా దక్కుతుందని ప్రొఫెసెర్ కూరపాటి వెంకటనారాయణ చెప్పారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో మండల కమీషన్ ద్వారా రాష్ట్రంలో బీ .సీ.లకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో బీ .సీ. ల సమగ్ర కులగణన విషయంలో ప్రభుత్వం చేత ప్రకటన చేయించడంలొ సీ.ఎం రేవంత్ రెడ్డి ని ఒప్పించడంలొ సఫలికృతం అయిన రాష్ట్రం మంత్రులు పొన్నం ప్రభాకర్,ధనసరి సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ ఐక్య వేదిక నాయకులు,
కే.యు.మాజి రిజిస్ట్రార్, ఆచార్య సదానందం మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీ. సీ.లను ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నారని,బీ.సీ ప్రధాని అని చెప్పిన బీ.సీ. లకు ఒరిగిందేమి లేదన్నారు.ఈ సందర్భంగా విలేఖరుల సమావేశానికి అధ్యక్షత వహించిన బీ .సీ. ఐక్య కులాలవేదిక నాయకులు, పాస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ సీ.ఏం రేవంత్ రెడ్డి సమగ్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం, బహుజనుల ముఖాల్లో రేవంత్ సూర్యోదయం అని కొనియాడారు. తెలంగాణలొని బీ.సీ. కులాల చిరకాలవాంఛ సమగ్ర కులగణన అని ,ఇది జరిగితే బీ .సీ.లకు విద్య , ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమన్యాయం తో పాటు సామాజిక న్యాయం జరుగుతుందాన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో బీ.సీ. కులాల ఐక్యవేదిక నాయకులు ఆచార్య వడ్డే రవీందర్, దయ్యాల సుధాకర్ అడ్వకేట్, బీ. సీ. సంగం జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్, గునిగంటి శ్రీనివాస్, అడ్వకేట్, డాక్టర్ వీ.వీరాచారి , డాక్టర్ నల్లాని శ్రీనివాస్, డాక్టర్ శివ నాగయ్య, డాక్టర్ చాగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *