సిక్తా పట్నాయక్
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల భాగంగా ఎన్నికల కోసం బాలికల ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఎన్నికలు సరిపోవు గదులు, కరెంటు, నీటి వసతులు గురించి తెలుసుకున్నారు. బాలికల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి పిల్లలను పాఠ్య పుస్తకం చదివించడంతోపాటు,పాఠశాల సుందరీకరణ కోసం పెయింటింగ్ డిజైన్ చాలా అందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం రాధమ్మ పిల్లలకు పెట్టడం జరుగుతుంది దీనిని ఎమ్మార్వో, ఎంపీడీవో ప్రతిరోజు రుచి చూసి నాకు రిపోర్ట్ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు దీటుగా గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ క్లాసులు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత గురించిజడ్.పి.హెచ్.ఎస్ బాలికలప్రధానోపాధ్యాయురాలు కలెక్టర్ తో సాంఘిక , గణితం బోధించే ఉపాధ్యాయుల కొరత ఉంది ఈ సంవత్సరం పిల్లలకు అన్యాయం జరగకుండా చూసుకోవడం జరిగింది పాఠశాల పై భాగంలో ఉన్న వాల్ శిథిలావస్థలో ఉందని తల్లిదండ్రులు చెప్పడంతో దీనిని వెంటనే రిపేర్ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది,ఎమ్మార్వో ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.