
Coalition Govt Supports Differently Abled with Devices
వికలాంగులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం
*ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 71.31 లక్షలు విలువజేసే 1078 పరికరాల పంపిణి..
పలమనేరు(నేటి ధాత్రి(
అగస్టు 21:
ప్రత్యేక ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాలలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సుమారు 71.31 లక్షల విలువచేసే 1078 ( ట్రై సైకిల్లు, వినికిడి యంత్రాలు ,వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ తదితర) పరికరాలను ఆయన చేతుల మీదుగా శుక్రవారం పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాది డిసెంబర్ లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారుఅర్హులైన వారికి వారి శారీరిక వైఖల్యం బట్టి పరికరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారుఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నట్లయితే త్వరలో శిబిరాన్ని ఏర్పాటు చేసి అర్హులందరికీ పరికరాల అందిస్తామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను 100% పూర్తిచేసిందని, చెప్పని హామీలను సైతం నెరవేర్చి రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. అనంతరం దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారుఈ కార్యక్రమంలో పలమనేరు ఆర్డీవో భవాని, దివ్యాంగుల సంక్షేమ సంఘం సహాయక సంచాలకులు వినోద్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణారెడ్డి, నాయకులు కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, మదన్, కిరణ్, బిఆర్సి కుమార్,జనసేన నాయకులు దిలీప్, నాగరాజు లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.